ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ (1879-1955)

0
134

గొప్ప శాస్త్రవేత్త, శాంతి కామకుడు, సంగీత ప్రియుడు, సున్నత హృదయుడు, ఆధునిక భౌతిక శాస్త్రానికి పితామహుడు ఐన్‌స్టైన్. ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం భౌతిక శాస్త్ర రూపు రేఖలనే మార్చివేసింది. ద్రవ్యరాశి, పొడవు, కాలం వంటి బౌతిక లక్షణాలు ఆ పదార్థ వేగాన్ని బట్టి మారుతూ వుంటాయని ఆయన సృష్టంగా పేర్కొన్నారు.

ఐన్‌స్టైన్ 1879 మార్చి పద్నాలుగవ తేదీన దక్షిణ జర్మనీలో ఉల్మ్‌లో జన్మించారు. చిన్ననాటి నుంచి సిగ్గు, బిడియం ఎక్కువ. తల్లి వద్ద పియానో నేర్చుకున్నారు. చిన్నాన్న ద్వరా గణితం నేర్చుకున్నారు. మాక్స్‌టాట్‌మె అనే వైద్య విద్యార్థి ఇచ్చిన సైన్స్‌ పుస్తకాల వల్ల కొత్త ప్రపంచాన్ని తెలుసుకోగలిగారు. ఐదేళ్ళ వయస్సులో తండ్రి ఇచ్చిన దిక్సూచి, సైన్స్‌పై అతని మక్కువను పెంచింది. పన్నెండు సంవత్సరాల వయస్సులో యాక్లిడ్‌ గణితం ఐనిస్టైన్‌పై ఎంతో ప్రభావాన్ని చూపింది.

వ్యాపారంలో నష్టం రావడంతో తల్లిదండ్రులు అతనిని మ్యూనిచ్‌లోనే వదలి ఇటలీకి వెళ్లారు. కొంత కాలానికి తను కూడా ఇటలీకి చేరుకున్నారు. జ్యూరిచ్‌లో పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేశారు. తనతో చదివిన మిరేవా మేరిక్‌ను వివాహం చేసుకొన్నారు. 1902లో ఒక పేటెంట్‌ ఆఫీస్‌లో గుమాస్తాగా చేరారు. తీరిక సమయాల్లో, సెలవు రోజుల్లో శాస్ర్తీయ విషయాల గూర్చి ఆలోచిస్తూ నోడ్సు తయారు చేసుకొనేవారు. పేటెంట్ ఆఫీసులోనే సాపేక్ష సిద్ధాంతం రూపుదిద్దుకుంది. 1905లో జ్యూరిచ్ విశ్వ విద్యాలయంలో పి.హెచ్.డి తీసుకున్నారు. అదే సంవత్సరం ఐదు పరిశోధనా పత్రాలు సమర్పించారు.

1)ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్  2) బేనియన్ చలానాలు, 3) విశిష్ఠ సాపేక్ష సిద్ధాంతము, 4) పదార్థము, శక్తి, 5) కాంతి దాని ప్రయాణము. అప్పటికీ అతని వయస్సు 26 సఁవత్సరములే. 1910లో ప్రెగ్లో ప్రోఫెసర్‌గాను, 1914లో జ్యూరిచ్లో ప్రోఫెసర్‌గాను చేశారు.  1914లో అమెరికాలో పర్యటించి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో చేరారు. చివరకు అమెరికాలోనే స్థిరపడ్డారు. 1940లో అమెరికా పౌరసత్వం స్వీకరించారు.

ఒక వస్తువు వేగాన్ని పెంచుకుంటూ పోతే దాని ద్రవ్యరాశి కూడా పెరుగుతూ వుంటుంది. అప్పుడు దాని వేగాన్ని పెంచాలంటే ఎక్కువ శక్తిని వినియోగించాలి. దీనిని బట్టి ఒక పదార్థం దాని శక్తి ఒకటేనని ఐన్‌స్టైన్ తెలియజేశారు. శక్తి, పదార్థ నిష్పత్తిని  “ E=mc2”  సూత్రంతో నిర్వహించారు. ఈ సూత్రం అణు శాస్త్రాభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. ఐన్‌స్టైన్‌ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం విశ్వం అనంతం కాదు.అది పరిమితం. దానికి అవధుల్లేవు.విశ్వానికి పొడవు, వెడల్పులతోపాటు నాలుగో కొలత కాలం కూడా ఉంటుఁదని ప్రతిపాదించారు. స్థలాన్ని, కాలాన్ని విడదీయలేమని దీని “స్పేస్‌ టైన్‌ కంటిన్యువమ్” అని పేర్కొన్నారు.

1916లో తాను ప్రతిపాదించిన సాదారణ సాపేక్ష సిద్ధాంతం ద్వారా నూటన్ గురత్వాకర్షణ సిద్ధాంతాన్ని తోసి పుచ్చారు. మనకు కనిపించే గురుత్వాకర్షణ నిజంగా గురుత్వాకర్షణ కాదని వస్తువుల చలనం వల్ల కలిగే మార్పులని ప్రతిపాదించారు. సూర్యుడి పరిసరాల్లో నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కిరణాలు ఎంత పంపు తిరిగి ఉంటాయో ఖచ్చితంగా లెక్క వేసి చెప్పారు. 1919 మే 29న సంభవించిన సూర్యగ్రహణం సమయంలో ఆయన ప్రతిపాదనను పరిశీలించగా ఆయన చేసిన లెక్కలు దాదాపు సరిపోయాయి.

1921సంవత్సరంలో ఫోటో ఎలక్ట్రిక్‌ ప్రభావంపై ఆయన చేసిన పరిశోధనలకుగాను నోబుల్ బహుమతి వచ్చింది. విచిత్రమేమిటంటే సాపేక్ష సిద్ధాంతానికి పితామహుడైన ఐన్‌స్టైన్‌కు ఆ సిద్ధాంతానికి నోబుల్ బహుమతి లభించలేదు.

పిల్లల బుర్రలలోకి బలవంతంగా విషయాలను కూరే విద్యా విదానమంటే ఆయనకు ఏవగింపు. గొప్ప సంగీతకారుడు. గొప్ప శాస్త్రవేత్త. ఇద్దరు కవులే అనేది ఆయన విశ్వాసం. మొదటి ప్రపంచ యుద్ధం చూసి ఆయన చలించిపోయారు. దుర్మార్గమైన యుద్ధానికి తోడ్పడంకంటే తాను ముక్కలుగా అయిపోవటమే మేలని భావించారు. ఆణుశక్తి శాంతి ప్రయోజనాలకే వాడుకోవాలని పదే పదే ఆయన చెప్పారు. విశ్వ రహస్యాలు తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తల దృక్పధమే మారిపోవాలని ఆయన బావించేవారు. విశ్వ మానవునిగా ఉండాలని ఆయనకు చిన్ననాటి నుండి కోరిక. సంగీత కచ్చేరీలకు వెళ్లి ఆనందంలో మునిగి పోయేవారు. మరలా ఇంటికి వచ్చి అర్థరాత్రి దాకా వయోలిన్ వాయిస్తూ ఆనందఁలో మునిగి పోయేవారు.

హీరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబు సృష్టించిన వినాశనం ఆయన మనస్సును కలిచి వేసింది. ఈ ఘోరం జరుగుతుందని ఊహ మాత్రంగా తెలిసి వున్నా భౌతిక శాస్ర్తాన్ని వదిలి చెప్పులు తయారు చేసుకొంటూ బ్రతికేవాణ్ణి అని హృదయ బారంతో చెప్పారు.

 ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని స్వీకరించమంటే నిరాకరించారు. తన శేష జీవితాన్నంతా పరిశోధనకే అంకితం చేసిన ఈయన ఏప్రిల్ 18న 1955లో తనువు చాలించారు.

ఈయన చనిపోయిన తర్వాత ఈయన మెదడుపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఐన్‌ స్టైన్‌ మీద గౌరవ సూచకంగా ఒక మూలకానికి ఐనిస్టీనియమ్ అని పేరు పెట్టారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here