నానో టెక్నాలజి

0
155

అతి సూక్ష్మమైన పరికరాలను, పదార్థాలను తయారు చేసే టెక్నాలజీని “నానో టెక్నాలజీ” అంటారు. పూర్తి నానో టెక్నాలజీ ఏర్పడటానికి ఇంకా ఎంతో కాలం పట్టినా కొన్ని స్థాయిలలో ఈ అవకాశం అధికంగా ఉంది.

1955లో ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త “రిచర్డ్ ఫేమస్” ఈ నానో టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. రసాయనికి మూలకాల ధర్మాలు మనకు చేలా కాలంగా తెలుసు.

ఈ మూలాకల్లో సూక్ష్మమైన మార్పులు సంభవించితే వాటి ధర్మం మారిపోతుంది. బొగ్గు, వజ్రం రెండు క్భన పదార్థాలే. అయితే వాటి అణువుల అమరికలో తేడా వల్ల అవి అలా ఏర్పడ్డాయి. ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా అణు స్థాయిలో వాటిని మార్చ గలిగితే బొగ్గును వజ్రంగా మార్చవచ్చు. అవసరాలకు తగినట్లుగా వివిధ పదార్థాలలోని అమువులను క్రమ పద్ధతిలో మార్చటమే ఈ టెక్నాలజీ విశేషం.

నానో టెక్నాలజీ ఇప్పటి వరకు రెండు పద్ధతులలో ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. 1) టాప్ డౌన్ పద్ధతి  2) బాటమ్ అప్ పద్ధతి.

టాప్ డౌన్ పద్ధతిలో అన్ని పరికరాలను క్రమేపి సూక్ష్మస్థాయికి తగ్గించటం, ఇప్పుడున్న మూడంగుళాల సైజులలో ఉన్న మైక్రో ప్రాససర్లను క్రమేపి సూక్ష్మస్థాయికి తీసుకురావటం.

బాటమ్ అప్ పద్ధతిలో బయో టెక్నాలజీ, రసాయన శాస్త్రం ఆధారంగా పదార్ధాలలో అణువులను క్రమ పద్ధతిలో అమర్చటం.

ఇప్పటికే ఆరంభమైన ఈ టెక్నాలజీ ద్వారా ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను తయారు చేయటం మొదలు పెట్టాయి. ఉదాహరణకు రెడీమేడ్ దుస్తుల కంపెనీ ‘లీ’ బట్టలపై మరకులు పండని, నలగని రెడీమేడ్ దుస్తులను తయారు చేస్తోంది. సాధారణ దుస్తులకు నానో స్థాయి కణాలను చేర్చడమే దీని విశేషం. న్యూజెర్సీకి చెందిన ఇన్ మాట్ కంపెనీ ఎక్కువ కాలం మన్నే టెన్సీస్ బాల్స్‌ను నానో టెక్నాలజీతో తయారు చేస్తోంది. ఎక్కువకాలం మనగలిగే టైర్లు, రసాయనిక దాడులు సైనికులు ఎదుర్కొనేందుకు నానో గ్లౌస్‌లను తయారుచేస్తోంది.

పిల్లల ఆట వస్తువులలో ఈ నానో టెక్నాలజీ ప్రవేశించింది. భవిష్యత్తులో ఫ్యూయిల్ కార్లు, గృహ అవసరాలకు ఫ్యూయల్ సెల్స్ ఉపయోగంలోకి వస్తాయి. ఒక ఫ్యూయల్ సెల్ కనీసం 10 గంటల పాటు పనిచేస్తుంది. 60 అణువులతో ఉండే కార్భన్ నిర్మాణాన్ని బకిచాల్ అంటారు. బకిచాల్ నిర్మాణంతో ఎయిడ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ క్వాలిటీ, మన్నిక మొదలగునవి అందించే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయికి చేరితే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here