ఫ్రీ సాఫ్ట్‌వేర్ – LINUX

0
130

fre soft-6కంప్యూటర్ హార్డ్వేర్ మెదడు అనుకొంటే ఆలోచనలు ప్రకియలు, సాఫ్ట్ వేర్‌తో పోల్చవచ్చు. అయితే మానవుడికి మేథస్సు, ఆలోచన స్వతహాగా ఉంటుంది. కంప్యూటర్‌కు మాత్రం మానవ మేథస్సే ప్రాణం పోయ్యాలి. కంప్యూటర్ అన్ని రకాల కార్యక్రమాలకు సాఫ్ట్‌వేర్ తప్పక కావాలి. సాంకేతిక పరిభాషలో సాఫ్ట్‌వేర్ ను Information Communication Techniques (ICT)  ఒక భాగంగా పిలుస్తాము. అంటే కంప్యూటర్ ఓపెన్ కావాలన్నా, కీ బోర్డు నుంచి ఆదేశాలు తీసుికోవాలన్నా అప్లికేషన్లను ప్రెజెట్ చేయాలన్నా పైల్సుని నియంత్రించాలన్నా, ప్రతి విషయాన్ని మానిటర్‌పై fre soft-5చూపాలన్నా, ఇతర సాఫ్ట్‌వేర్‌లను, ప్రోగ్రామ్‌లను అనుసంధానం చేయాలన్నా, ప్రింటర్‌కు కమాండ్‌ ఇవ్వాలన్నా – దానికంతా ఒక ప్రోగ్రామింగ్ ఉండాలి. దానినే మనం “ఆపరేటింగ్ సిస్టమ్” (OS) అని పిలుస్తాము. మనకు దాదాపు100 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే మనకు అధిక ప్రాచుర్యం పొందింది మాత్రం  విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.

fre soft-4సాఫ్ట్‌వేర్ అనేది సాంకేతిక విలువలు కల్గిన ఒక వినియోగ వస్తువుతో పోల్చవచ్చు. మానవ మేధస్సే దీనికి ముఖ్యమైన పెట్టుబడి. అతి తక్కువ ఖర్చుతో, శ్రమతో దీనిని పునరుత్పత్తి (Reproduction)  చేయవచ్చు. ఇది తరిగి పోవడమంటూ ఉండదు. అదే కాకుండా దీనిని బదిలీ చేయటం (Copy) కూడా దాదాపు ఖర్చులేని పనే. అయితే రాను రాను సాంకేతిక విప్లవం వల్ల అనేక ఆఫ్లికేషన్లు అనేక రకాల సాఫ్ట్‌వేర్లు కావాల్సివచ్చాయి. 1979లో AT & T2 యునిక్స్ (unix) ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాణిజ్య పరంగా ప్రవేశపెట్టింది. అసలు Unixను “కెన్ థాంమ్సన్, డెన్సీస్‌రిచి” 1969లో బెల్స్ ల్యాబ్‌లో రూపొందించారు. దాదాపు ఏడేళ్ళకాలంలో అనేక మంది ప్రోగ్రామార్లు, రీసెర్చి స్కాలర్లు, విద్యార్థులు సమిష్టిగా అందరూ కలిసి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక మార్పులు చేసి రూపొందించారు. అంత వరకు ఇది అందరికీ అందుబాటులో ఉండింది.  ET&T Unixను వాణిజ్య పరంగా చేయటాన్ని వీళ్ళంతా వ్యతిరేకించారు. దీంతో బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు ప్రత్యేకంగా బర్కిలీ స్టాండర్డ్ డిస్ర్టిబ్యూషన్  (BDS) పేరుతో ఫ్రీ – యునిక్స్ వర్షన్ రూపొందించుకొన్నారు. ఈ BDSనే US డిఫెన్స్ ఏజన్సీ తన ఇంటర్నెట్ కార్యకలాపాలకు ఉపయోగించుకొంది.

fre soft-3ఆ తర్వాత ప్రఖ్యతా ప్రోగ్రామర్ “ఆర్చ్ హకర్ రిచెర్డ్” – ఎమ్.స్టాల్‌మన్‌ – తన జాబ్‌ను వదిలేసి ప్రీ సాప్ట్‌వేర్‌ ఫౌండేషన్ (FSF) పేరుతో బోస్టన్‌లో ఒక సంస్థను 1985 అక్టోబర్‌లో స్థాపించారు. ఆయన తన సంస్థ ద్వారా యునిక్స్ లాంటి GNU అనే ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని ముఖ్య ఉద్దేశ్యంగా ఎంచుకొన్నారు. స్టాల్‌మాన్ పూర్తస్థాయిలో GNUను రూపొందించారు. అయితే కెర్నేల్ (kernel) OSలో ముఖ్యభాగం మాత్రం అభివృద్ధి దిశలో ఉండింది. అయినప్పటికి ప్రోగ్రామర్లు దాన్ని ఉపయోగించటం మొదలు పెట్టారు.

 fre soft-2స్టాల్‌మాన్‌ దీంతో ఫ్రీ సాప్ట్‌వేర్‌ వినియోగించే వారి కోసం నాలుగు ప్రధాన సూత్రాలను రూపొందించారు. 1) ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని స్వాతంత్ర్యం, 2) సాప్ట్‌వేర్ ఏ విధంగా పని చేస్తుందో తెలుసుకొనే స్వాతంత్ర్యం. 3) తన వివిధ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకొని స్వాతంత్ర్యం – ఈ సాప్ట్‌వేర్‌కాపీ చేసి ఇతరుల వినియోగానికి అందించుకొనే స్వాతంత్ర్యం. 4) సాఫ్ట్‌వేర్‌లోని ప్రోగ్రామ్‌లను మార్పులు చేసుకొనే అవకాశం. మార్పులు చేసిన వర్షన్ ప్రజలకు అందుబాటులోకి తేవడం వంటి నాలుగు సూత్రాలను రూపొందించి GNUకు పబ్లిక్ లైస్సెను కల్పించారు.

fre soft-1ఆ తర్వాత లైనస్ టార్వాడ్ అనే ఫిన్‌లాండ్ విద్యార్థి యునిక్స్ లాంటి కెర్‌నెల్‌ను 1991లో రూపొందించాడు. మార్చి 13, 1994 ఆదివారం  22-28 నిమిషాలకు ఈ పూర్తి వర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌లో ఫ్రీ వర్షన్‌గా పొందుపరిచారు. అనేక మంది ఉత్సాహవంతులు దీనిని డౌన్‌లోడ్‌ చేసుకొని అనేక మార్పులు చేర్పులు చేశారు. లినెక్స్ కర్నేకు జియన్‌యు. యుటివిటీస్, ఇతర గ్రాఫికల్ ఇంటర్‌ఫేజ్‌లుకలిపి సి.డి.లలో లేదా వెబ్‌సైట్‌లో రూపొందే విధంగా రూపొందించారు.

fre soft-990దశఖం అంతంలో GNU/Linux పూర్తి స్థాయి ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌గా రూపొందించబడింది. ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్ మీద ఉండే అన్నీ అపోహాలు తొలగి పోయి పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, అనేక మంది వ్యాపర వేత్తలు లినెక్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మినియన్ల మంది ఈ ప్రీ సాప్ట్‌వేర్‌ను వినియోగించు కొంటున్నారు. అనేక ఇతర సంస్థలు లినెక్స్ వర్షన్ సాఫ్ట్‌వేర్‌లను, ప్రోగ్రామ్‌లను  రూపొందించాయి. స్టార్ ఆఫీస్ పేరుతో సన్‌మైక్రో సిస్టమ్ ఆఫీస్ అప్లికేషన్‌ను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు జర్మనీ, అర్జెంటీనా, బ్రెజిల్ వాటి ప్రభుత్వాలు లైనెక్స్ అన్నింటికంటే అత్యుత్తమమైనవిగా ప్రకటించాయి. మెక్సికో తమ స్కూల్ ప్రాజెక్టు క్రింద లైనెక్స్‌ను ఉపయోగించుకొని 120 మిలియన్ల అమెరికన్ డాలర్లను మిగుల్చుకొంది. చైనా తమ సొంతంగా GNU/Linux అఫిషియల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా రూపొందించుకొంది.

fre soft-7భారతదేశంలో కూడా ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా FSF-I పేరుతో ఒక సంస్థ వెలిసింది. భారతదేశంలో అనేక ప్రభుత్వ, ప్రవేట్ రంగ సంస్థలు లినెక్స్‌ను ఎంచుకొని తమ కార్యకాలాపాలను కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హైకోర్టు సెంట్రల్ కార్పొరేషన్, ఐ.డి.బి.ఐ., ఏషియన్ పెయింట్స్, రియన్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, రేమాండ్, హెచ్.డి.యఫ్.సి. బ్యాంక్, సెంట్రల్ రైల్వే, ఎయిర్ ఇండియా, బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ వంటి fre soft-11ప్రముఖ సంస్థలు లినెక్స్‌ను ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నాయి.

లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా Word Excelలాగానే  Open Office Software ఉంటుంది. Word, Excel కంపాటిబిలిటీ ఉంటుంది.  IBM, HP, Dell సంస్థ లైనెక్స్‌కు అనుగుణంగానే హార్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నాయి.

fre soft-10ఇండియాలో రెడ్‌హాట్ (ఇండియా) లినెక్స్ డిస్ట్రిబ్యూటర్‌గా వుంది. విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకొని ఎంతో వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా వాటి అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవచ్చు. ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. వివిధ అఫ్లికేషన్లు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా చేసుకోవచ్చు. లినెక్స్‌పై ప్రత్యేక మాగ్‌జైన్ మార్కెట్‌లో దొరుకుతుంది. దాని ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు.

వినెక్స్‌కు సంబందించిన సమాచారం కోసం ఈ క్రింది. వైబ్ సైట్‌లను సందర్శించవచ్చు.

www.linux.org, www.linux_usg.org, www.linuxtoday.com.

లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను సరఫరా చేసే ప్రముఖ కంపెనీలు 1) రెడ్ హాట్ లినెక్స్ (www.redhat.com), 2) మాండ్రెక్ లినెక్స్ (www.mandrake_soft.com)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here