ఓజోన్

ఉపాధ్యాయ లోకం బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

ఓజోన్

భూమిపై ఉండే వాతావరణాన్ని నాలుగు ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం 15కి.మీ ఎత్తు వరకు ఉండే వాతావరణాన్ని ట్రోపొ ఆవరణం అంటారు. మరో పది కిలో మీటర్లు మేరకు స్ర్టోటో అవరణముంది.ఆ పైన మెజో, ఐనో అవరణాలున్నాయి. స్ట్రాటో ఆవరణములు ఓజనో పొర ఉంటుంది. ఇది బూమి చుట్టూ ఒక పొరగా వ్యాపించి సూర్యరశ్మి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా కాపాడుతుంది.

మూడు ఆక్సిజన్ పరమాణువుల సమ్మేళనమే ఓజోన్. షుమారు 95 రకాల రసాయనాలు ఓజోన్ క్షీణితకు కారణమవుతున్నాయి. ఏరోసెల్, బ్రోమిన్‌తో కూడిన సమ్మేళనాలు నష్టం కలిగిస్తున్నాయి. డొమెస్టిక్ రిప్రిజరేటర్లు, డీప్ ఫ్రీజర్లు, ఐస్‌క్రీమ్ క్యాబినెట్లు, బాటిల్ కూలర్లు, వాటర్ కూలర్లు ఇతర కూలింగ్ ఉత్పత్తుల వల్ల ఓజోన్ పొరకు నష్టం కల్గుతుంది. ఇవి విడుదల చేసే రసాయనాల (క్లోరోఫ్లోరా కార్భన్) నుంచి క్లోరిన్ వాయువు ఎక్కువగా వెలువడుతుంది. క్లోరిన్ అణువు, ఓజోన్తో చర్య జరిపి విచ్చిన్నం చేస్తుంది. దీనివల్ల ఓజోన్ పొర పలుచబడి ఆ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి.

 ఈ ఓజోన్ రంధ్రాల గుండా సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు డైరెక్టుగా బూమిని చేరుతున్నాయి. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది. కంటి శుక్లాలు దెబ్బతింటుంటాయి. నాడీ వ్యవస్థకు ప్రమాదం సంభవిస్తుంది. మొక్కలలో ఎదుగుదల ఆగి పోతుంది. ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని తిరిగి పూడ్చడానికి షుమారు 50ఏళ్ళు సమయం పడుతుందని శాస్ర్తజ్ఞులు అంచనా వేశారు. ఖగోళ శాస్త్రవేత్తల హెచ్చరికలతో ప్రపంచదేశాలన్నీ కలసి 1995 మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేశాయి. అందులో మన దేశం కూడా వుంది. 2010 కల్లా 95 రకాల రసాయన పదార్థాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించాయి.

మన దేశం చైనా తర్వాత ప్రపంచంలో ఎక్కువగా క్లోరో ఫ్లోరో కార్భన్స్ వాడే దేశం. ఈ సమస్య అందరి సమస్య. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. ధర్మోకోల్ కప్పులను, పాకింగ్‌లను, ఎయిరోసాల్ స్ప్రేల వాడకం పూర్తిగా తగ్గించి వేయాలి. తరచూ రిఫ్రిజిరేటర్లను సర్వీసు చేయించడం లాంటి చర్యలు తీసుకోవాలి.

సెప్టెంబర్ 16వ తేదీన ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఆప్ ది ఓజోన్ గా ప్రకటించారు. ఇలాంటి సందర్భాలలో ఏదో మొక్కబడిగా కార్యక్రమాలను నిర్వహించడం కాకుండా శాశ్వత చర్యలు తీసుకొనేందుకు కార్యక్రమాలు చేపట్టాలి. ముంచుకొచ్చే ప్రమాదాల గూర్చి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *