నీటి కాలుష్యం – ఒక పరిశీలన

రిసోర్స్ సెంటర్ సైన్స్ ప్రయోగాలు

నీటి కాలుష్యం – ఒక పరిశీలన

నీరు కలుషిత అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా క్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటం లేదా అతి తక్కువ శాతం ఉండడం జరుగుతుంది. క్లోరిన్ హెచ్చు తగ్గుల వలన అనేక శారీరక రుగ్మతలు కల్గుతున్నాయని పరిశోధనలు వెల్లడిచేస్తున్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలస్ట్రాల్, డయాబిటీస్ వంటి వ్యాధులు క్లోరిన్ హెచ్చు తగ్గుల వల్లే కల్గుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

క్లోరైడ్లు అధికంగా ఉండే నీటిని హార్డ వాటర్ అంటాము. హార్డ వాటర్తో సోపును ఉపయోగించినప్పుడు నురుగు రాదు. సాఫ్ట్ వాటర్ క్లోరైడ్ల శాతం తక్కువగా ఉంటుంది.

సమస్య, విశ్లేషణ లేదా ఆశయము

పరిసర ప్రాంతాలలోని వివిధ బావులు, బోరుల నుండి నీటి నమూనాలను సేకరించి పరిశీలించటం, పరిశుభ్రమైన హార్లిక్స్ సీసాలలో వేర్వేరు ప్రాంతాలలోని బావులు లేదా చెరువుల నుండి నీటిని సేకరించి వాటి మీద సేకరించిన ప్రాంతం పేరు, బావి లేదా బోర్‌కు ఒక కోడ్ నెంబరు ఇచ్చి ఆ సీసాల పై లేబుల్స్ అతికించండి. షుమారు నాలుగా లేదా ఆరు వేర్వేరు ప్రాంతాలలో శాంపిల్స్‌ను సేకరించండి.

ఇప్పుడు శాంపిల్స్‌లో సల్ఫైడ్‌లు, క్లోరైడ్‌ శాతాన్ని పరిశీలించాలి. సల్ఫైడ్‌ల శాతం తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా క్లోరైడ్‌ల శాతాన్ని పరిశీలించండి. ఇతర కలుషితాలు ఏమున్నాయో గుర్తించండి.

కావలసిన పరికరాలు

బ్యూరెట్, పిప్పెట్, క్రోనికల్ ప్లాస్క్, స్టాండు, గ్లాస్ రాడ్, బీకరు.

రసాయన పదార్థాలుః సిల్వర్ నైట్రేట్, పొటాషియం క్రోమేట్

పరిశీలన మరియు ప్రయోగ పద్ధతి

క్రోమేట్ టైట్రేషన్ మెథడ్

శాంపిల్స్‌లోని నీటిని 10మి.లీ. క్రానికల్ ప్లాస్క్‌లో తీసుకోవాలి. 10%  పొటాషియం క్రోమేట్ను 1,2 చుక్కలు దానిలో కలపాలి. 0.005 సిల్వర్ నైట్రేట్ను బ్యూరెట్లో తీసుకోవాలి. ఈ ద్రావకాన్ని క్రానికల్ ప్లాస్కులలో చుక్కలు చుక్కలుగా పడేటట్లు స్టాండుకు అమర్చుకోవాలి. బ్యూరెట్‌లో మొదటి రీడింగ్‌ను నోట్‌ చేసుకోవాలి. క్రానికల్ ప్లాస్కులోని నీరు పింక్ రంగు వచ్చే వరకు సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని చుక్కలు, చుక్కులుగా పడేట్లు చేయాలి. అదే ఎండ్ పాయింట్ అవుతుంది. ఈ విధంగా పలుమార్లు ప్రయోగాన్ని చేసి దగ్గర వాల్యూను గుర్తించాలి. దీనిని బట్టి ఒక లీటరు నీటిలో ఉండే క్లోరిన్ శాతాన్ని లెక్కించాలి.

ప్రయోగ ఫలితం

మీరు ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్న రీడింగులను నోట్ చేసి వివిధ నమూనాల్లోని నీటిలో క్లోరైడ్ శాతాన్ని లెక్కించండి.

చుట్టు ప్రక్కల ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను వివరించండి. సముద్రానికి ఆ ప్రాంతం ఎంతో దూరంలో ఉంది. చుట్టూ ఫ్యాక్టరీల వల్ల డ్రైనేజీ వల్ల, రొయ్యల చెరువుల వల్ల మురికి కాల్వలు, గుంటల వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించండి. ఈ విషయాలను చర్చించండి.

చర్చ-పరిష్కారం

పరిశీలించిన అంశములపై సమగ్రంగా చర్చించండి. అందుకు పరిష్కార మార్గాలను సూచించండి.

సహకరించినవారు

ఈ ప్రయోగానికి సహకరించిన వారి పేర్ల వివరాలను వ్రాయండి

పరిశీలన – గ్రంథాలు – వ్యాసాలు

మీ ప్రయోగ పరిశీలనకు అనుసరించిన పద్ధతులను, విషయాలను సేకరించిన పరిశీలనా పుస్తకాల పేర్లు, వ్యాసాల పేర్లు, రచయిత మొదలగు వివరాలు వ్రాయండి.

ఈ ప్రయోగాన్ని పరిశీలించటానికి మీ తరగతి ఉపాధ్యాయుని సహయం తీసుకోండి. ఎందువల్లనంటే పరికరాలు, రసాయన పదార్థాలు మీ పాఠశాల లాబొరేటరీవి ఉపయోగించుకోవాలి కాబట్టి. ఇంకా ఈ విషయంలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ వారి సహాయం తీసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *