0
49

కథల కాణాచి ……

విద్యలో ముఖ్యమైనవి నాలుగు అంశాలు. ౧.భాషాసాహిత్యం ౨. కథలు ౩. చిత్రలేఖనం ౪. పుస్తకపటనం. ఈ నాలుగు అంశాలు పిల్లవాని సృజనాత్మకతకు సంబంధిచినవి. సాహిత్యం అది ఏ భాషలోనైనకావచ్చు మంచి విలువలతో కూడినసాహిత్యం చదివినప్పుడు పిల్లల మనోభావాలలో కొత్త ఆలోచనలు మొదలౌతాయి. తమను తాము ప్రశ్నించుకోవడం మొదలౌతుంది. సున్నిత భావాలను మనసులో చొప్పించడం జరుగుతుంది. ఒక కవిత ద్వార ఒక అద్భుత విషయాన్నీ గ్రహించవచ్చు, గొప్ప వ్యక్తుల జీవితచరిత్ర లేదా సంఘటనల ద్వారా మనసులో ఒక క్రొత్త ఆలోచన లేదా నిర్ణయం ఏర్పరుచుకోవచ్చు. కొన్ని సందర్భాలలో పిల్లవాని ప్రవర్తన, నడవడి, అలవాట్లలో అద్భుతమైన మార్పులు సంభవించవచ్చు. ఇంత అద్భుతమైన ఈ ప్రక్రియను మనం నిజంగా (ఉపాధ్యాయులం) పిల్లలకు ఆస్థాయిలో భోదించగల్గుతున్నామా? కొత్త ఆలోచనలకు, ఊహాశక్తికి స్థానం కల్పించగాల్గుతున్నామా? ఈ ప్రక్రియను అద్భుతంగ తరగతిగదిలో భోదించగల్గితే క్రమశిక్షణ, నీతినిగూర్చి, ప్రవర్తననుగూర్చి వేరే పాటాలు నేర్పించాల్సిన అవసరం ఉందా?

కథలు:

ఇక కథల విషయానికి వస్తే పిల్లల ఆలోచనలకు, అనుభూతులకు , ఉద్దేశాలకు, కల్పనలకు కథలు చెప్పడం, చదివించడం ఒక అద్భుత ప్రక్రియ. ఈనాటి స్పీడు యుగంలో బామ్మలకు తీరికలేదు, తల్లిదండ్రులకు తీరికలేదు. ఇక ఉపాధ్యాయులకు అంత తీరికలేదు, ఓపిక లేదు. మంచి కథలు పిల్లవాని మనసుఫై ప్రభావం చూపి ఆలోచించటం నేర్చుకుంటాడు. తనకు ఇష్టమైన కథను ఎన్ని సార్లైనా వినేందుకు పిల్లవాడు ఇష్టపడతాడు. కొన్ని అద్బుత కధలు పిల్లవాని హృదయాన్ని కదిలిస్తాయి దుఖాన్ని బాధలను తనచుట్టువున్న ప్రపంచoతో పోల్చుకుంటాడు తన హృదయస్పందనలను, తన ప్రవర్తనలను ప్రశ్నిచుకుంటాడు. అయితే అలాంటి కధలను ఏర్చి,కూర్ర్చి పిల్లలకు అందించడంలో మనపాత్ర్ర (ఊపాధ్యయులు,రచయుతులు)ఎంతోవుంది.కొన్ని కధలు వాస్తవాలు కాదని పిల్లలకు తెలుసు .అయిన వాస్తవానికి విరుద్ధమైన కాల్పనిక కధలంటే పిల్లలకు ఇష్టం. ఎందుకంటే ఊహలోకంలో విహరించటమంటే మహా ఇష్టం. అందుకే హరి పొట్టర్ ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాచుర్యాన్ని పొందింది.
పిల్లలకు నీతి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఏది మంచి ఏది చెడు అనేది పిల్లలు కధలు ద్వారా చక్కగా గ్రహించగలుగుతారు. మన పాఠ్య పుస్తకాల్లో వల్లించే నీతులు బయటి ప్రపంచానికి విరుధంగా ఉంటాయి. కాని కథలలు అలాకాదు. వాస్తవాలను నిక్కచిగా వెల్లడిస్తాయి. అందువల్ల కథలవల్ల పిల్లలు వాస్తవాలను గ్రహించగల్గుతారు. చిన్నతనంలో కథలు బాగా విన్నవారు, చదివినవారు, ఎప్పటికి మానసిక దుర్భలులుగా ఉండరు. పురాణాలు, ఇతిహాసాలు, జానపథ కథలు, వైజ్ఞానిక కథలు, పక్షుల, జంతువుల కథలు ఇలా ఎటువంటి ఇతివృత్తం అయిన పిల్లలకు ఇష్టమే. టీవీలు, కంఫ్యుటర్లు వచ్చి పిల్లల మనోనేత్రాలను మూసివేస్తున్నాయి. పుస్తకం చదువుతున్నంతసేపు పిల్లలు తమ మనోనేత్రలతో అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతారు. కార్టూన్ ప్రక్రియ వైజ్ఞానిక అద్భుతమైనప్పటికి పిల్లల మానసిక వికాసానికి ఇవి ఎంతమాత్రం సహాయం చేయవు.

భాషాభివృద్ధికి కథలు ఎంతగానో ఉపయోగపడతాయి. కథలు చెప్పడం, చదివించటం ఒక ప్రక్రియ అయితే సృజనాత్మకతకు తోడ్పడే విధంగా కొన్ని బొమ్మలను ఇచ్చి కథలుగా మలచమనటం, కొన్ని పదాలు లేదా వాక్యాలు లేదా కొన్ని జంతువుల పేర్లను, పక్షుల పేర్లను ఇచ్చి పిల్లలను కథలను వ్రాయమనటం ఈ కోవలోకి వస్తాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here