సామాన్య శాస్త్రము

                                     హమ్మింగ్బబర్డ్                                                                                                                                    
 
 టీ.వి. రామకృష్ణ
 
                                                                                                                                                                                                                               హమ్మింగ్ బర్డ్ ప్రాణి  ప్రపంచంలొ ఒక అద్భుతమైన ప్రాణి.  దీని పొడవు  55మి. మి.,  బరువు కేవలం 3 గ్రాములు మాత్రమే ఉంటుంది.  కాని ఇది ప్రయాణించే దూరం సంవత్సరంలొ 1600 కిలో మీటర్లు ఉంటుంది.  అమెరికా నుంచి మెక్సికొకు ఎక్కడా  ఆగకుండా 25 గంటలపాటు  నిరంతరంగా ప్రయాణిస్తుంది.  
 
                          వీటిలో  320 జాతులు ఉన్నాయి.  వాటిలో  “రూబితోట్” అనే పక్షి చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది.   ఇంత చిన్న పక్షికి ఇంత అపారమైన శక్తి ఎలా వచ్చిందనే విషయం ఇప్పటికీ ఆస్చర్యం గొలిపే విషయమే.
 
                     రుబితోట్  తల నుంచి తోకవరకు మెరిసే ఆకుపచ్చ రంగులొ ఉంటుంది. మగ పక్షికి మెడ క్రింద ప్రక్క భాగాలు ఎరుపు రంగులొ ఉంటాయి.  ఆడ పక్షికి మెడ క్రింద తెల్లగా  ఉంటుంది.  ఈకలు రకరకాల రంగులలొ ఉండటంవల్ల  కాంతిని పరావర్తనం చేస్తాయి.  సుధీర్ఘ  ప్రయాణానికి  అకుకూలంగా రెక్కలు పొడవుగా, కురచగా ఉంటాయి. వేసవ్ ఇ కాలంలొ  సాధరణంగా  తోటలలో   ఎక్కువగా  “ఆర్కిద్స్ ”  పూలతొటలలొ గడుపుతాయ్  చలి కాలంలో అడవి  ప్రాంతాలలో గడుపుతాయి.  దీని  ముఖ్య ఆహారం పూలలొ ఉండే  తేనె. సాధరణంగా ఇది ఆహారం గ్రహించే  పూల ఆకారం కూడా దీని ఆకారానికి అనుకూలంగా ఉంటుంది. దీని నాలుక పొడవుగా బోలుగా, ట్యూబ్ ను పోలి ఉంటుంది.  నాలుకను పువ్వు లొనికి పోనిచ్చి రెండు  అంచుల ద్వారా తేనెను పీల్చు కొంటుంది.
 
                 ఈపక్షి ఇలా ఎగురుతూ తేనెను గ్రహిచెటప్పుడు ముందుకు,వెనుకకు కూడా కదల గలదు.  గాలిలొ రెక్కలు ఆడిస్తూ స్థిరంగా నిలబడగలదు.  నిలువుగా గాలిలో ఎగురుతూ నిలబడగలదు.  దీని రెక్కలు,   కండరాలు ఇలా కదలడానికి  అనుకూలంగా ఉంటాయి.  ఈ విధంగా ఎగిరే పద్దతి వేరే ఏ ఇతర పక్షులలొ కనపడదు.
 
              ఇది వెనుకవైపుకు ఎగరటానికి దాదాపు 80 డిగ్రీల కోణంలొ తిరుగుతుంది. ఇదిగిరికీలు  కొట్టెటప్పుడు 8 ఆకారంలొ రెక్కలను మార్చుకొంటుంది.  ఇది ఎగిరేటప్పుడు రెక్కలను  20-80 సార్లు ఆడిస్తుంది.  స్థిరంగా నిలబడేటప్పుడు 200 సార్లు రెక్కలను ఆడిస్తుంది.  ఈ సమయంలొ గుండె 500 సార్లు కొట్టుకొంటుంది.   ఇంకా విచిత్రమైన విషయం,  ఇది చలి కాలంలొ గుండె కొట్టుకోవటం   పూర్తిగా ఆపేస్తుంది.  శారిరక చర్యలన్నిటిని ఆపేసి  చురుకుదనం లేకుండా గడిపేస్తుంది.  ఈ సమయంలొ శరీరం అనేక మార్పులకు లోనై అతిశీతల వాతావరణానికి  కూడా తట్టుకొగలుగుతుంది.
 
          మరలా  మే జూన్  మాసాలలో యెడతెరిపి లేకుండా ప్రయాణిస్తూ మెక్సికో నుంచి మెక్సికన్ గల్ఫ్ ను దాటుకొంటూ  అమెరికాను చెరుకొంటుంది.  చెట్టు కొమ్మల మధ్య చిన్న గూడు కట్టుకొంటుంది.  ఒక జత గుడ్లను పెట్టి ఆడ పక్షి పొదుగుతుంది.  16 రోజులకు పిల్లలు బయటకు వస్తాయి.    22 లేదా 23 రోజులకు అవి గూడు విడిచి వెళతాయి.  ఉష్ణ జంతువులలో ఒక యూనిట్ బరువులో అత్యధిక శక్తిని ఉత్పత్తి  చేసే శక్తి  ఒక హమ్మింగ్ బర్డ్ కి మాత్రమే ఉంది.గాలిలో హమ్మింగ్ బర్డ్ నిలకడగా నిలిచినప్పుడు అది ఉపయోగించుకొనే శక్తి, మానవుడు వేగంగా పరిగెత్తుతున్నప్పుడు  ఉపయోగించుకొనే శక్తి.కన్న పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.అదే మానవుడయితే తన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలంటే షుమారు 50 లీటర్ల చెమటను వినియోగించాలి. హామ్మింగ్ బర్డ్ రోజువారి కార్యక్రమాలకు వినియోగించే శక్తి ఉత్పత్తి చేయాలంటే ప్రతి రోజు 130 కిలోల మాంసం లేదా 165 కిలోల ఉడికించిన ఉర్లగడ్డ్స్లు తేద 60 కిలోల బ్రెడ్ ను వినియోగించుకోవాలి.
 
 ఈ విధంగా ఎన్నో విషయాలలో “హామ్మింగ్ బర్డ్” ప్రాణి ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రాణి.