సైన్స్ క్లబ్

 

 

సైన్స్ క్లబ్ సమాచారం

సైన్స్ క్లబ్ ఆవస్యకత

                                                                                                   టీ.వి. రామకృష్ణ

ప్రస్తుత మన విద్యావిధానంలొ పరిశీలనలకు ప్రయోగాలకు ఎక్కడా తావులేదు.  కేవలం విషయపరిజ్ఞానాన్ని  అందించడం, పరిక్షల ద్వార  విషయపరిజ్ఞానాన్ని  పరిశీలించి మార్కులు ఇవ్వటం జరుగుతోంది.   ప్రశ్నించుకొవటం, పరిశీలించటం, కొత్త ఆలొచనలకు, ఊహలకు, కొత్త ఆవిష్కరణలకు  ఈ నాటి  విద్యా  వ్యవస్థలొ  అవకాశమే లేదు.  విజ్ఞాన ప్రపంచంలొ  ఏ సిధ్ధాంతం శాస్వతం కాదు.  కొత్త పరిసోధనలు, పరిశీలనలు చేసినప్పుడు ఇంకొక నూతన సిధ్ధాతం ఏర్పడుతుంది.  భూమి బల్లపరుపుగా ఉంటుందనే విషయాన్ని కొన్ని సంవత్సరాల వరకు  నమ్మరు. ఆ తర్వత పరిశీలనలు,ప్రయోగాలు  ఆ సిధ్ధాంతాన్ని పటా  పంచలు చేసేసింది.   ఆధునిక వైజ్ఞానిక  యుగంలొ ఖగోళంలో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది.  అయితే  ముందు జరిపిన పరిశీలనలు, సిధ్ధాంతాలు   కొత్త ఆలొచనలకు, సిధాంతాలకు ప్రాతిపదికలు అవుతాయి.  “సైన్స్ క్లబ్’లు ఇలాంటి  ఎన్నొ అవకాశాలను కల్పిస్తుంది. కలసి పనిచేయటం, నాయకత్వం  వహించటం వంటి  లక్షణాలకు  ఇది అవకాసం   కల్పిస్తుంది.  “కమ్యునికేటివ్    స్కిల్స్” అభివృధి  చెందుతాయి.  మన దైనందిక  జీవితాలలొ సైన్స్ ఆవస్యకతను తెలియజేస్తుంది.  సమాజంలొ  ఉండే  మూఢనమ్మకాలను   ప్రశ్నించటం నేర్చుకుంటారు.   శాస్త్రీయ దృక్పదాన్ని  అలవరుస్తుంది.  స్రుజనాత్మకత  అభివృధి చెందుతుంది.  సామాజిక భాద్యతను  నేర్పిస్తుంది.

 సైన్స్  క్లబ్ ను  ఎలా ప్రారంభించాలి ? 

ముందుగా మీ సైన్స్ క్లబ్  కు ఒక మంచి పేరును ఎంచుకొండి.  మీకు నచ్చిన శాస్త్రవెత్త పేరునో లెదా మీ ప్రాంతంలొ వైజ్ఞనిక  పరంగా కృషి చేసిన వ్యక్తుల పేరునో లెదా  మీ ప్రాంతం  పెరునో ఎంచుకోవచ్చు. పేరు నిర్నయించుకొన్న తర్వాత ఆ క్లబ్  కు ఒక లొగో ను ఏర్పాటు  చేసుకోండి . మీ సైన్స్ మాస్టరు సహయంతొ  విద్యార్ధులందరు కలసి  కార్యవర్గ సభ్యులను  ఎంచుకోండి. ( ప్రెసిడెంట్, సెక్రటరి, ట్రెజరర్, మిగతా సభ్యులు )  మీ సైన్స్ మాస్టరు సహయంతొ సైన్స్ క్లబ్ కార్యక్రమాలకు టైంటేబుల్ తయారుచెసుకోండి. అలాగె ఒక నెల రోజుల ప్రణాలికను తయారు చేసుకొండి.

ప్రతి నెలా శాస్త్రవెత్తల  పుట్టిన రోజులను, ముఖ్యమైన రోజులను (ఉదా: నేషనల్ సైన్స్ డే- ఫిబ్రవరి – 28, జ్జగదీష్  చంద్ర  బోస్ పుట్టిన రోజు -నవంబరు -30 )నోట్  చేసుకొని ఉంచుకోవాలి. (మాస్టారు  ప్రతినెల సైన్స్ కాలండర్   ను ప్రచురిస్తుంది. దాన్ని ఫాలొ అయితే చాలు. ) ఆయా రోజులలొ వ్యాస  రచన పోటీలు, వకృత్వ  పోటీలు,  క్విజ్ లు నిర్వహించుకోవచ్చు. శాస్త్రవేత్తల  జీవిత చరిత్రలను, వారు ప్రతిపదించిన  సిధ్ధాంతాలను, కనుగొన్న విషయాలను గూర్చి చర్చించుకోవచ్చు. ప్రతినెల ఒక సర్వె కార్యక్రమాన్ని, ఫీల్డ్ ట్రిప్ ను ప్లాన్ చెసుకోవచ్చు.